పేదలకు గుడ్ న్యూస్..!
– ఇందిరమ్మ ఇండ్ల యాప్ వచ్చేసింది
– ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సర్కారు నుంచి శుభవార్త అందింది. రాష్ట్రంలోని ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ఇండ్లను మంజూరు చేసింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఇటీవలే అర్హుల గుర్తింపు కోసం ఇందిరమ్మ యాప్‌ను కూడా ప్రవేశ పెడతామని గతంలో ప్రకటించింది. తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం ఆవిష్కరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు. రూ.10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడు రూ.5 లక్షలకు చేరుకుందని తెలిపారు ‘‘రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పాటు, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది మా లక్ష్యం. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఇదికూడా చదవండి…

