ఉత్సహాంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
– 20 ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు
– చదువు నేర్పిన ఉపాధ్యాయులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని విలియం మూన్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఉత్సహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి వి ద్యార్థులు ఆదివారం ఆదే పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

20 ఏండ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలలో మైమరిచి పోయారు. అప్పడు చదువు చెప్పిన టీచర్ల రతన్ రస్, వెంకట్ రెడ్డి, భారతి, కమాలోద్దీన్, క్రాంతి కుమార్, శైలజను ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు విశాల్, జయప్ప, హారిక, అరుణ, రాజు, ప్రభాకర్, ప్రకాష్, జగదీష్ తదితరులు ఆట పాటలతో సందడిగా గడిపారు. మరోవైపు టీచర్లు జీవితంలో స్థిరపడిన విద్యార్థులను అభినందించారు.
ఇది కూడా చదవండి….

