ఏడు మంది పేకాట రాయుళ్లపై కేసు

క్రైం తాండూరు

ఏడు మంది పేకాట రాయుళ్లపై కేసు
– రూ. 9800లు స్వాధీనం, పేకాట ముక్కలు సీజ్
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : నిషేధిత పేకాట ఆడుతున్న ఏడు మందిపై తాండూరు మండలం కరణ్ కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మండలంలోని చెన్ గెష్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మంగళవారం గ్రామంలో పోలీసులు దాడులు నిర్వహించగా తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లికి చెందిన తలారీ శ్రీనివాస్, చాకలి రమేష్. గాంధీనగర్‌కు చెందిన మాల శ్రీనివాస్, ధోబీగల్లికి చెందిన చాకలి బిచప్ప, పాత తాండూరుకు చెందిన మంగలి అశోక్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూరుకు చెందిన పెద్దకూర్వ హన్మంతు, తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌కు చెందిన బుడిగ జంగం ఆంజనేయులు పేకాట ఆడుతున్నట్లు గుర్తించి అదపులోకి తీసుకున్నారు. అదేవిధంగా. వారి వద్ద నుంచి రూ. 9800ల నగదు స్వాధీనం చేసుకుని 52 పేకాట ముక్కలను సీజ్ చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.