తాండూరు పట్టణాభివృద్ధికి కృషి
– మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం సహాకారంతో తాండూరు పట్టణాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పరసన్ స్వప్న పరిమళ్ పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలను పరిష్కరించి తాండూరును అభివృద్ధి పరుస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో తాండూరును ఆదర్శంగా నిలుపుతావని, ఇందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్ నాయకులు మసూద్, కౌన్సిలర్లు రవి, వెంకన్నగౌడ్, ముక్తార్ నాజ్ తదితరులు
పాల్గొన్నారు.
