బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి సేవా స్ఫూర్తి..!
– శిశుమందిర్‌కు భారీ విరాళం
– ఉపాధ్యాయ దినోత్సవ కానుక
– సన్మానించిన యజమాన్య కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మరోసారి సేవా స్పూర్తిని చాటుకున్నారు.

శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరులోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలకు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులే భవిష్యత్ భారత నిర్మాతలని అన్నారు.

సరస్వతీ విద్యాపీఠం, శిశుమందిర్ విద్యాలయాలు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులను సామాజిక స్పృహ, దేశభక్తి కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో పాఠశాలకు సహకారం అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.

విరాళం అందించిన శ్రీనివాస్‌రెడ్డికి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు డా. మల్లేశం, పాఠశాల అధ్యక్షుడు కటకం వీరేందర్, యాజమాన్య కమిటీ సభ్యులు పెరుమాళ్ల రాంరెడ్డి, అనంతరెడ్డి, జి. నరేందర్, కౌన్సిలర్లు జుంటుపల్లి వెంకట్, ఎం. రామకృష్ణ, ఎన్. రాజుగౌడ్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, భీంశెట్టి మధుసూదన్, సుబ్బారావు, ప్రభుశంకర్, మాజీ కౌన్సిలర్ జుబేర్లాల్, జోషి వికాస్, ప్రహ్లాద్, సమద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


