పండగలా బతుకమ్మ చీరల పంపిణీ
– అందజేసిన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
– పంపిణీ చేసిన మాజీ వైస్ చైర్ పర్సన్ రత్నమాల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగింది. ఆదివారం సాయిపూర్లోని రేషన్ దుకాణాలలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అస్థిత్వానికి బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. పండగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త చీరలను పంపిణీ చేస్తుందన్నారు. మహిళలందరు బతుకమ్మ చీరలను ధరించాలన్నారు.
వచ్చే బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ వనజ, సిబ్బంది, మహిళలు ఉన్నారు.
ఇది కూడ చదవండి..

