తిరుమల బ్రహ్మోత్సవాలలో తాండూరు కళాకారులు

తాండూరు రాజకీయం వికారాబాద్

తిరుమల బ్రహ్మోత్సవాలలో తాండూరు కళాకారులు
– డాన్స్ మాస్టర్లు, 65 మందికి అరుదైన అవకాశం
– లంబాడి, దింసా, మత్తూరి, గుస్సాడి నృత్యాలతో కనువిందు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తాండూరు ప్రాంత కళాకారులు తమ జానపద నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన పలువురు డాన్స్‌ మాస్టర్లతో పాటు సుమారు 65 మంది కళాకారులు బ్రహ్మోత్సవాల నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తాండూరుకు చెందిన డాన్స్‌ మాస్టర్లు రమేష్‌, హన్మంతు, అశోక్‌ మాస్టర్‌ కుమారుడు సాయితేజతో పాటు నారాయణపేటకు చెందిన హరిత, మహబూబ్‌నగర్‌కు చెందిన దివ్య, ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలు రాజేశ్వరి, విద్యార్థులు తదితరులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాకారులు లంబాడి, దింసా, మత్తూరి, గుస్సాడి తదితర జానపద నృత్యాలను ప్రదర్శించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల వంటి ప్రతిష్ఠాత్మక వేడుకలో తమ కళను ప్రదర్శించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని తాండూరు డాన్స్‌ మాస్టర్లు రమేష్‌, హన్మంతు తెలిపారు.

తమతో పాటు విద్యార్థులు, ఇతర కళాకారులు పాల్గొనడం మరింత సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం ద్వారా తెలంగాణ జానపద కళలకు మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

చిన్నారి ఊయల వేడుకలో బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి