తాండూరు మార్కెట్‌లోకి న్యూ బెలినో కారు

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మార్కెట్‌లోకి న్యూ బెలినో కారు
– ఆవిష్కరించిన మాజీ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
– నెక్సా షోరూమ్‌లో నెలకొన్న సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లో నెక్సా కార్‌ షోరూమ్‌లో నూతన బెలినో కారును ప్రారంభించారు.

బుధవారం మున్సిపల్‌ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ ఫ్లోర్‌ లీడర్‌ పట్లోళ్ల దీప నర్సింహులు ముఖ్య అతిథిగా హాజరై వార్డు కౌన్సిలర్‌ ఈర్షద్‌ తోకలిసి నూతన కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూమ్‌ ప్రతినిధులు న్యూ బెలినో ప్రత్యేకతలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు.

ఈ సందర్భంగా దీప నర్సింహులు మాట్లాడుతూ.. తాండూరు ప్రాంత ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన వాహన మోడళ్లను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. న్యూ బెలినో మంచి డిజైన్‌, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు.

షోరూమ్‌ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నూతన మోడల్‌ అందుబాటులోకి రావడంతో షోరూమ్‌లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలలో తాండూరు కళాకారులు