మాజీ కౌన్సిల‌ర్ నీర‌టీ శ్యాంసుంద‌ర్ క‌న్నుమూత‌

తాండూరు వికారాబాద్

మాజీ కౌన్సిల‌ర్ నీర‌టీ శ్యాంసుంద‌ర్ క‌న్నుమూత‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ మాజీ కౌన్సిల‌ర్ నీర‌టీ శ్యాంసుంద‌ర్ క‌న్నుమూశారు. మున్సిప‌ల్ ప‌రిధి పాత తాండూరుకు చెందిన శ్యాంసుంద‌ర్ శుక్ర‌వారం అధిక ర‌క్త‌పోటుకు గురై త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా శ్యాంసుంద‌ర్ శెట్టి చంద్ర‌శేఖ‌ర్ తాండూరు మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్న స‌మ‌యంలో మార్వాడి బ‌జార్ ప్రాంత కౌన్సిల‌ర్‌గా ప‌నిచేశారు. మాజీ కౌన్సిల‌ర్ శ్యాంసుంద‌ర్ మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు శ‌నివారం నిర్వ‌హిస్తున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.