పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి 
– కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు
తాండూరు
, దర్శిని ప్రతినిధి: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి అన్నారు.
మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం శానిటేషన్‌ వర్కర్ల కోసం నిర్వహించిన హెల్త్‌ క్యాంపును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “పట్టణ పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ ఎంతో కష్టపడుతున్నారు. వారి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. విధి నిర్వహణలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.

కార్మికుల
ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్సిపాలిటీ తరఫున కార్మికులకు అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం వైద్యులు పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ అబ్దుల్‌ రజాక్‌, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, శానిటేషన్‌ కార్మికులు పాల్గొన్నారు.


తాళం కనిపిస్తే.. స్కెచ్‌ రెడీ..!