పారిశుద్ధ్య కార్మికుల‌కు స‌హ‌క‌రించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పారిశుద్ధ్య కార్మికుల‌కు స‌హ‌క‌రించాలి
– చెత్త ఎక్క‌డప‌డితే అక్క‌డ వేయొద్దు
– మ‌ల్కాపూర్ గ్రామ స‌ర్పంచ్ విజ‌య‌ల‌క్ష్మీ పండ‌రి
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : చెత్త‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేయొద్ద‌ని, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌కు అంద‌రు స‌హ‌క‌రించాల‌ని తాండూరు మండ‌లం మ‌ల్కాపూర్ గ్రామ స‌ర్పంచ్ విజ‌య‌ల‌క్ష్మీ పండ‌రి అన్నారు. శుక్ర‌వారం గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యంలో పారిశుద్ధ్య కార్మికుల‌కు హ్యాండ్ గ్లౌజ్, సేఫ్ జాకెట్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయ‌తీ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై శ్ర‌ద్ద వ‌హ‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అదేవిధంగా గ్రామ‌స్తులు చెత్త‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేయొద్ద‌న్నారు. చెత్త‌ను సేక‌రించే ట్రాక్ట‌ర్‌ల‌కు అంద‌జేయాల‌న్నారు. త‌డి చెత్త‌ను, పొడి చెత్త‌ను వేరువేరుగా అంద‌జేయాల‌న్నారు. ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటార‌న్నారు. పారిశుద్ధ్య కార్మికుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు.