యాలాల యువ నాయకుడికి శుభ ప్రద్ పటేల్ పరామర్శ
– ఒలివ్ ఆసుపత్రిలో పలకరించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
యాలాల, దర్శినిప్రతినిధి : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఒలివ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాలాల మండలం కోకట్ గ్రామ యువ నాయకుడు రామకృష్ణ ముదిరాజ్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ పరామర్శించారు.

ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స, ఆయన కోలుకుంటున్న తీరుపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

రామకృష్ణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు శుభ ప్రద్ పటేల్ తెలిపారు.


