ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి తాండూరు టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎన్నికల తరువాత తొలిసారి శుక్రవారం తాండూరుకు వచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా.. బాల్ రెడ్డి, కౌన్సిలర్లు రవి, వెంకన్నగౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల తదితరులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, సీనియర్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త, సాయిపూర్ బాల్ రెడ్డి, అజయ్ ప్రసాద్, యువనాయకులు బిర్కడ రఘు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
