దత్తాత్రేయుని సేవలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

దత్తాత్రేయుని సేవలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌
– గాన్గాపూర్‌లో దంపతుల ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి దంపతులు కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గాణగాపూర్‌ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

శుక్రవారం వారి వివాహా వార్షికోత్సం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామీ ఆసీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి వారి కృపాకటాక్షాలు తాండూరు పట్టణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. వివాహ వార్షికోత్సవాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి సన్నిధిలో జరుపుకున్నారు.

ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌..!