పకడ్బందీగా డిజిటల్ సర్వే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పకడ్బందీగా డిజిటల్ సర్వే..!
– తప్పులు లేకుండా నమోదు చేయాలి
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు ఫ్యామీలీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధి మల్ రెడ్డిపల్లిలో ప్రయోగాత్మకంగా డిజిటల్ కార్డుల ఫ్యామీలీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేస్తున్న సర్వేను సమీక్షించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ కార్డుల ఫ్యామీలీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్వేలో యజమానిగా సీనియర్ మహిళ పేరు, ఆపై కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. అందరు సమన్వయంతో నిర్ణీత గడువులోగా నివేధికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్ బాలప్ప, మేనేజర్ నరేందర్ రెడ్డి, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో గంజాయి చాక్లెట్లు..!