విద్యార్థులకు ఎస్పీ ట్రస్ట్ ప్రోత్సహాం అభినందనీయం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులకు ఎస్పీ ట్రస్ట్ ప్రోత్సహాం అభినందనీయం
– తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి
– అట్టహాసంగా ఎస్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : శుభప్రద్ పటేల్(ఎస్పీ) ట్రస్ట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృషి చేయడం అభినందనీయమని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి అన్నారు. ఆదివారం ఎస్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని సల్లా గార్డెన్ లో పదో తరగతి, ఇంటర్, డిగ్రీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడిన అద్యాపకులు, ఉపాధ్యాయులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీదేవి, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తెలంగాణ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, ట్రస్ట్ చైర్మన్ శ్రీవాణిలు హాజరయ్యారు. తాండూరు నియోజకవర్గంలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులు, అద్యాపకులకు వారి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాలను అందజేశారు.

అంతకుముందు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన శుభప్రద్ పటేల్ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సహించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తామన్నారు. ట్రస్ట్ చైర్మన్ శ్రీవాణి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ట్రస్ట్ ముందుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, యాలాల జెడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణి, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, సోమశేఖర్, ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ట్రస్ట్ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాలేజీ ప్రిన్సిపల్స్, విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage