భాష్యం విద్యార్థినికి రాష్ట్ర స్థాయి ర్యాంకు
– సన్మానించిన కళాశాల యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాల విద్యార్థిని ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించింది. గురువారం విడుదలైన తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన విద్యార్థిని భాగ్యలక్ష్మీ స్టేట్ 5వ ర్యాంకును సాధించింది. ఫస్టియర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో భాగ్యలక్ష్మి 463/470 సాధించి సత్తా చాటింది.
అదేవిధంగా కళాశాలకు చెందిన పెద్దేముల్ నిఖిల్ ఎంపీసీ విభాగంలో 439/470, నేహా 421/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో గీతికా రాథోడ్ 398/440, శివతేజ 385/440 మార్కులు సాధించారు. సీఈసీలో ప్రవీణ 421/500 మార్కులు, భవాని 405/500 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకును సాధించిన విద్యార్థిని భాగ్యలక్ష్మీని కళాశాల యజమాన్యం, అద్యాపకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపల్ డి.రామకృస్ణ మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన భాగ్యలక్ష్మి ఎంతో శ్రద్ధగా పట్టుదలతో బాగా చదివి స్టేట్ ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే అత్యుత్తమ మార్కులు ఫలితాలు సాధించవచ్చన్నారు. ర్యాంకులు అనేవి జ్ఞానానికి కొలమానం కాదని, జ్ఞానాన్ని పొందడానికి విద్యార్థులు కఠోర శ్రమ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైస్ ప్రిన్సిపల్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ అనేక ఒడిదుడుకుల నడుమ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరిగాయన్నారు. అయితే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు అధైర్య పడకుండా రాబోయే సెకండ్ ఇయర్ పరీక్షలకోసం బాగా సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వెంకటరెడ్డి, మల్లిఖార్జున్, అధ్యాపకులు మహిపాల్ రెడ్డి, సూర్య, శాంతయ్య, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, భాను ప్రసాద్, నౌషీన్ తదితరులు పాల్గొన్నారు.
