ఎక్క‌డి నుంచైనా రేష‌న్ స‌రుకులు

తాండూరు వికారాబాద్

ఎక్క‌డి నుంచైనా రేష‌న్ స‌రుకులు
– వ‌న్ నేష‌న్ వన్ కార్డుతో కూలీలు, కార్మికులకు ల‌బ్ది
– ప‌క‌డ్బందీగా అమ‌లుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కృషి
– సంపూర్ణ వ్యాక్సీనేష‌న్‌కు రేష‌న‌ల్ డీల‌ర్లు స‌హ‌క‌రించాలి
– వికారాబాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్
– అజాదీకా అమృత్ మ‌హోత్స‌వంపై అవ‌గాహ‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశంలో రేష‌న్ ల‌బ్దిదారులు ఎక్క‌డి నుంచైనా స‌రుకులు పొందే వెసులు బాటును కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డు వ్య‌వ‌స్థ‌తో అందుబాటులోకి తీసుక‌వ‌స్తుంద‌ని వికారాబాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్ అన్నారు. గురువారం తాండూర్ సివిల్ సప్లై గోదాములో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను పురస్కరించుకొని ఆజాదీకా అమ్రుత్ మహోత్సవ మరియు వన్ నేషన్ వన్ కార్డు అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో దేశమంతా ఒకే కార్డు అనే నినాదంతో దేశంలోని ఏ రాష్ట్రంలో నైనా ఎక్కడ నైనా లబ్ధిదారులు తమ సరుకులు తెలుసుకునేందుకు వీలుగా ఈ విధానాన్ని తీసుకరావడం జరిగిందని అన్నారు. ఈ విధానంతో వలస కూలీలు వలస కార్మికులకు ముఖ్యంగా లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎందరో అమరులు అందించిన త్యాగాల ఫలితమే స్వాతంత్రం అని వారి త్యాగాల ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నాము అని వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
రేషన్ డీలర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఓ రాజశేఖర్, డిఎం విమల, ఆర్డిఓ అశోక్ కుమార్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు యాలాల ఎంపీపీ బాలేశ్వర గుప్తా, బి ఏ ఓ మహేష్ గౌడ్ ,గోదాం ఇన్చార్జి రవికుమార్, తాండూర్ నియోజకవర్గ వివిధ రేషన్ డీలర్లు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.