కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ..!
– సీఎం బొమ్మై సర్కారు కీలక నిర్ణయం
– 28 నుంచి పది రోజులు అమలు
– న్యూఇయర్ వేడుకలు రద్దు
దర్శిని డెస్క్: కరోనా కేసులు, ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఒమైక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఈ పరిస్థితులు కర్ణాటక రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు నెలకొడంతో ఆదివారం కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో సీనియర్ మంత్రులు, అధికారులు, కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. న్యూ ఇయర్ గేదరింగ్స్, ఫంక్షన్లపైనా ఆంక్షలు విధించారు. బయటి ప్రదేశాల్లో ఫంక్షన్లు, పార్టీల్లాంటి జరపడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా డీజేలు, భారీగా జనం గుమికూడటంపై నిషేధం విధించారు. హోటల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు మొదలైనవి.. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపుకోవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, నైట్ కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా జరిపే పార్టీలు, జనం గుమికూడటంపైనా ఆంక్షలు విధించారు.

