సామాజిక సమస్యల పరిష్కారానికి యువత ముందుండాలి
– బీసీ సంక్షేమ సంఘం కన్వినర్ రాజ్ కుమార్ కందుకూరి
– పెద్దేముల్ బీసీ యువజన సంఘం అధ్యక్షులుగా బాలు నియామకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సమస్యల పరిష్కరించడంతో యువత ముందుండి కీలకపాత్ర పోషించాలని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలానికి సంబంధించి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ యువజన సంఘం అధ్యక్షులుగా కురువ బాలును నియమించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ బాలుకు నియామకపత్రం అందజేశారు. అనంతరం రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ మంచి సమాజ నిర్మాణానికి యువతతో పునాది పడుతుందన్నారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. సామాజిక అంశాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండా రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులుగా ఎన్నికైన బాలును అభినందిస్తూ గ్రామ గ్రామాన బీసీ సంఘం కమిటీలను వేయాలని, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాల పెద్దల సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మండల యువజన సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన కురువ బాలు మాట్లాడుతూ తనపై నమ్మకంతో యువజన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు బీసీ కన్వీనర్ రాజ్ కుమార్, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మాజీ ఎంపీటీసీ ఇందూరు బాల్‌రాజ్, తట్టేపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజి, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశం, యాలాల మండల అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి, బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు బోయ రాధాకృష్ణ, ఇందూరు వెంకట్, కృష్ణ, నారాయణ, చందు, బస్వరాజ్, అజయ్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.
