దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న జర్నలిస్ట్ పి. రాంచందర్ మిత్రబృందం

తాండూరు వికారాబాద్

దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న జర్నలిస్ట్ పి. రాంచందర్ మిత్రబృందం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా పరిధిలో గల వెల‌సిన శ్రీ దత్తాత్రేయ స్వామిని తాండూరు సీనీయ‌ర్ జ‌ర్న‌లిస్టు పి.రాంచంద‌ర్, అత‌ని మిత్రబృందం స‌భ్యులు ద‌ర్శించుకున్నారు. గురువారం రాత్రి ద‌త్తాత్రేయ స్వామిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. క‌రోనా నియంత్ర‌ణ‌తో పాటు ఒమిక్రాన్ ముప్పు తాండూరు ప్ర‌జ‌ల‌పై ప‌డ‌కుండా చూడాల‌ని స్వామిని వేడుకున్న‌ట్లు తెలిపారు. దత్తాత్రేయ స్వామిని ద‌ర్శించుకున్న వారిలో రాంచంద‌ర్‌తో పాటు మిత్రులు రామలింగ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నాగేందర్ నాయుడు త‌దితరులు ఉన్నారు.