పద్మశాలీయులు రాజకీయంగా ఎదగాలి
– తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– పద్మశాలి సమాజం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పద్మశాలీయులు రాజకీయంగా ఎదగాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో జరిగిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్మశాలీయులు యేళ్ల తరబడిగా బట్టలు నేస్తూ ప్రజలు ఆత్మాభిమానంతో ఉండేలా చేశారన్నారు. అత్యధిక సంఖ్యలో ఉన్న పద్మశాలి కులస్థులు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆధునిక యంత్రాలు పెరిగి పోవడం తో మగ్గాల పై బట్టలు నేసే వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని అన్నారు. అందరూ ఐకమత్యంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని. అదేవిధంగా శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు దూస రాములు, పాపయ్య, రాములు, శ్రీనివాస్, సాక్షి రామకృష్ణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

