శాకాంబరీ దేవి నమోస్తుతే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శాకాంబరీ దేవి నమోస్తుతే..!
– వాసవీ మాతకు ప్రత్యేక అలంకరణ
– వారాహీ నవరాత్రి ఉత్సవాల పూజలు
– పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : శాకాంబరీ దేవీ నమోస్తుతే అంటూ వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య మహిళ భక్తులు అమ్మవారిని కొలిచారు. వారాహీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో వెలసిన వాసవీ మాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. వాసవీ మహిళ సంఘం, నగరేశ్వర దేవాలయ పాలక మండలి, ఆర్యవైశ్య సంఘం, మహిళ సంఘం ఆద్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గోని అమ్మవారిని దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషకరమన్నారు.

మరోవైపు అషాఢమాసం సందర్భంగా సంఘం సభ్యులు, మహిళలు గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి.శ్రీశైల్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), నాయకులు శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, దేవాలయ చైర్మన్ కుంచెం మురళీధర్, కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్, వాసవీ మహిళ సంఘం అధ్యక్షులు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శురాలు మంకాల స్వప్న రాఘవేందర్, సభ్యులు శోభ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సేవతో ప్రజా ప్రతినిధులకు గుర్తింపు