టీనేజర్లు తప్పక టీకా తీసుకోవాలి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

టీనేజర్లు తప్పక టీకా తీసుకోవాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల దీపా నర్సింలు
– వార్డులో ముమ్మరంగా వ్యాక్సినేషన్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : 15 నుంచి 18 ఏండ్లు నిండిన టీనేజర్లు కరోనా వ్యాక్సినేషన్ తప్పక తీసుకోవాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సాయిపూర్ 9వ వార్డులో టీనేర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకు టీనేజ‌ర్లు హాజ‌రై ముమ్మ‌రంగా వ్యాక్సీనేష‌న్‌ను వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు వ్యాక్సినేషన్ పంపిణీని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాప్తి ఉదృతంగా మారడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తుందన్నారు. కావున‌ 15 నుంచి 18 ఏండ్లు నిండిన పిల్లలు వి 5 టీకా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోసును కూడ తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు సంక్రాంతి పండుగను కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని అన్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా, ఓమిక్రాన్ పట్ల అందరు అప్రమత్తంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుధారాణి, ఆశ వర్కర్ అనిత, అంగన్వాడి టీచర్ నవీన, వార్డు ప్రజలు, యువకులు తదితరులు పాల్గోన్నారు.