సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలి
– మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల
– 21వ వార్డులో ముందస్తు సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ సీనీయర్ కౌన్సిలర్ జుబేర్ లాల పేర్కొన్నారు.
గురువారం మున్సిపల్ పరిధిలోని 21 వ వార్డులో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వార్డు ప్రజల ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు సంబరాలను ఉత్సహాంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ సల్మా ఫాతిమా భర్త, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంక్రాంతి సందర్భంగా వార్డు మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సహాంగా ముగ్గులు వేశారు. అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. అందమైన ముగ్గులు వేసిన మహిళలకు, చిన్నారులకు ముఖ్య అతిథిగా హాజరైన జుబేర్ లాల సొంత ఖర్చులతో నగదు బహుతులతో పాటు ఇతర బహుమతులను అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సహాకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. వార్డు ప్రజలు సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. మరోవైపు కరోనా బారిన పడిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, టీఆర్ఎస్ నాయకులు బీదర్ రాజశేఖర్, వార్డు పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

