జన చైతన్య సేవలు ఆదర్శనీయం
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్
– యువజన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జనచైతన్య యువజన సంఘం చేస్తున్న సేవలు ఆదర్శనీయమని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్య సమాజ్‌లో జన చైతన్య యువజన సంఘం నూతన సంవత్సరం 2022 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై తాండూరు పట్టణ ఎస్ఐ అరవింద్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేష్, తాండూరు సిద్ధార్థ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, దళిత బహుజన నాయకులు ప్రేమ్ కుమార్‌లతో కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మురళీకృష్ణగౌడ్‌తో పాటు పలువురు మాట్లాడుతూ జన చైతన్య యువజన సంఘం సేవలను కొనియాడారు. పండగ సమయాల్లో నిరుపేదలకు సహాయం చేయడం, కోవిడ్ సమయంలో వైద్యులు, నర్సులనను సన్మానించడం అభినందనీయమన్నారు. ఇలాంటి స్పూర్తి సేవ కార్యక్రమాలను కొనసాగించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య యువజన సంఘము అధ్యక్షుడు రఘు, సభ్యులు జుంటుపల్లి వెంకట్, సాయి ప్రసాద్, రాము ముదిరాజ్, రమేష్ టైలర్, రవికుమార్, శివకుమార్, వినోద్, కృష్ణ, మహేష్, నరేష్, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, మహేష్, పెంటయ్య రజక, విక్రాంత్, ఆర్యసమాజ్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

