హమాలీ కార్మికుల అభ్యున్నతికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

హమాలీ కార్మికుల అభ్యున్నతికి కృషి
– అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు వచ్చేలా చొరవ
– ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
– గంజ్ హమాలీ కార్మిక సంఘం ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నెహ్రు గంజ్ హామాలి కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం హమాలీ కార్మిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గంజ్లోని హమాలి, దడువై, చాట కార్మికుల సంక్షేమానికి తోడ్పాటు అందిస్తామన్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన హమాలి కార్మిక సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.

కార్మికులకు హామి ఇచ్చిన విధంగా ఐదు ఎకరాలలో ఇండ్ల స్థలాలు ఇప్పించే విధంగా చొరవచూపుతామన్నారు. అంతకుముందు హమాలి కార్మిక సంఘం నూతన కార్యవర్గంలో గౌరవాధ్యక్షులుగా భీమప్ప, అధ్యక్షులుగా మస్తిపురం చిన్న అంజప్ప, ఉపాధ్యక్షులుగా డి.అశోక్, జే. అశోక్, ప్రధాన కార్యదర్శిగా చంద్రబండ నర్సింలు, సహాయ కార్యదరు లుగా భీరప్ప (వీరేశం), గుండప్ప, కోశాధికారులుగా కె. బాలప్ప, వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా రాము, చింతలయ్య, కుర్వ మల్లప్ప, శ్రీనివాస్, సలహాలదారులుగా భద్రప్ప, నర్సింలులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సోమశేఖర్, ది గ్రేన్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, గంజ్ వ్యాపారులు, సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఎక్కడున్నావమ్మా.. స్వాతీ..!