పెరుగుతున్న ప‌రీక్ష‌లు.. త‌గ్గ‌ని కేసులు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

పెరుగుతున్న ప‌రీక్ష‌లు.. త‌గ్గ‌ని కేసులు
– తాండూరులో ఒకే రోజు 60 న‌మోదు
– పెద్దేముల్ మండ‌లంలో 10 కేసులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతోంది. రోజు రోజుకు రెట్టింపు కేసులు న‌మోదుతున్నాయి. గ‌త యేడాది ఎలాంటి కేసులు లేక‌పోయినా ఈ యేడాది మొద‌టి నుంచి కేసుల ఉధృతి ప్రారంభ‌మ‌య్యింది. మొద‌ట్లో ఒకటి రెండు న‌మోద‌య్యే కేసులు ప్ర‌స్తుతం వంద వైపు దూసుకెళుతున్నాయి. తాండూరులోని జిల్లా ఆసుప‌త్రిలో ప్ర‌జ‌లు క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌ల‌కు ఎగ‌బ‌డుతున్నారు. రోజూ ఆసుప‌త్రిలో నిర్దార‌ణ ప‌రీక్ష‌లు పెరిగిపోతున్నాయి. ఇంద‌కు త‌గ్గ‌ట్లు కేసులు కూడ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క‌రోజు 43 మందికి పాజిటివ్ వ‌చ్చింది. సోమ‌వారం 60 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఈనెల 1 మొద‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 246 కేసులు పాజిటివ్‌లో ఉన్న‌ట్లు జిల్లా ఆసుప‌త్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డా.బాస్క‌ర్ తెలిపారు. మ‌రోవైపు తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్దేముల్ మండ‌లంలో కూడ క‌రోనా కేసులు భారీగా న‌మోదవుతున్నాయి. సోమ‌వారం ఒక్క‌రోజే 10 కేసులు న‌మోదైన‌ట్లు మండ‌ల ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది తెలిపారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి క‌రోనా నిర్దార‌ణ అయిన‌ట్లు తెలిపారు.