మ‌ళ్లీ ఫీవ‌ర్ స‌ర్వే – రేప‌టి నుంచి ప్రారంభం

ఆరోగ్యం తెలంగాణ హైదరాబాద్

మ‌ళ్లీ ఫీవ‌ర్ స‌ర్వే
– రేప‌టి నుంచి కార్యాచ‌ర‌ణ
– రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు ఆదేశం
– జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు, అధికారుల‌కు మంత్రి స‌మీక్ష‌
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రంలో మ‌ళ్లీ ఫీవ‌ర్ స‌ర్వే చేప‌ట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ద‌మవుతోంది. క‌రోనా కేసుల ఉధృతంతో ఇంటింటికి ఫీవ‌ర్ స‌ర్వే చేప‌ట్టాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు సూచించారు. గురువారం హైదరాబాద్ బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. అన్ని జిల్లాల‌లో క‌రోనా, ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి తీరు, కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్న నేపధ్యంలో .. రాష్ట్ర వ్యప్తంగా రేపటి నుండి ఫీవర్ సర్వే మొదలు పెట్టనున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అటు వాతావరణంలో మార్పులు.. ఇటు కరోనా వ్యాప్తి కారణంగా చాలామందిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం కొంతమంది కొన్ని లక్షణాలు కనిపిస్తున్నా టెస్ట్ లు చేసుకోవడం లేద‌ని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారుల తో ఫీవర్ సర్వే చేయిన్చానున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఇప్పటికే టెస్టులకు భారీగా కిట్ లను రెడీ చేసుకున్నామని చెప్పారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామం.. వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అదేవిధంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్ కిట్, టెస్టింగ్ కిట్ లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రం వాక్సినేషన్ లో ముందు ఉందని.. మొదటి డోస్ 103 శాతం పూర్తి చేయగా.. రెండో డోస్ 77శాతం పూర్తి అయిందన్నారు. ఇక బూస్టర్ డోస్ వేగవంతం చేయాలని అధికారులను వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు.