కాబోయే తల్లీ.. కోవిడ్‌తో జాగ్రత్త
– గర్భిణీలు అప్రమత్తంగా ఉంటేనే క్షేమం
– వైద్యుల సలహాలు, కరోనా నిబంధనలు తప్పనిసరి
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను తలకిందులు చేసిందనేది కాదనలేని సత్యం. అలాంటి మహమ్మారి నుంచి గుణపాఠాలు నెర్చకుని చాలా మంది జాగ్రత్త పడుతున్నారు. చిన్నారులు, వృద్దులను ఇంటి పెద్దలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. కరోనా మరోసారి విజృంభిస్తున్న తరుణంలో కాబోయే తల్లులు, నిండు గర్భిణిలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాశశశశ గర్భిణీల పట్ల వివక్షలు వెలుగుచూస్తున్న సంఘటనలతో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.
గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటించడం అవసరం
– గర్భిణీలు మొదటి నెల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం, వస్త్రాల, నివాసముండే ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
– ప్రతి పనిలో పరిశుభ్రత అలవర్చకోవాలి. తమతో ఉండే వారు కూడ పాటించేలా చూడాలి. అనవసరంగా ముక్కు, కళ్లను తాకకుండా చూసుకోవాలి.
– పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన నీరు తాగాలి.
– కరోనావైరస్ లక్షణాలు అంటే దగ్గు, తుమ్ము, జలుబు, జ్వరం ఉన్న వారితో దూరంగా ఉండాలి.
– శుభకార్యాలకు, పెండ్లిళ్లకు దూరంగా ఉండడమే మంచిది. గర్భిణీలకు నిర్వహించే శ్రీమంతం తదితర వేడుకలలో జాగ్రత్తలు పాటించేలా చూసుకోవడం ఉత్తమం.
– వైద్యుల సలహాలు తీసుకుంటూ ఆసుపత్రులలో నెలవారి పరీక్షలు తగ్గించుకోవాలి.
– 8,9 నెలలు నిండిన గర్భిణీల పట్ల కుటుంభీకులు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ గర్భిణీకి కోవిడ్ సోకినట్లు తెలిస్తే వారిని ఆసుపత్రిలో చేర్పించుకుంటున్నారా లేదా అని తెలుసుకోవాలి.

