1నుంచి పాఠశాలల పునఃప్రారంభం
– అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
– స్కూళ్లు తెరిచినా నిబంధనలు ఖచ్చితం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో కరోనా ప్రభావంతో మూతపడిన పాఠశాలలు వచ్చే నెల ఫిబ్రవరి 1 నుంచి పున:ప్రారంభం కాబోతున్నాయి. శనివారం ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతికి ఇచ్చిన సెలవులను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ఈనెల 30 వరకు పొడిగించారు. రేపటితో సెలవులు ముగుస్తున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతునన కరోనా ప్రభావంతో పాఠశాలల పునఃప్రారంభంపై శనివారం మధ్యాహ్నం వరకు సంద్గితత నెలకొంది. పాఠశాలల పునఃప్రారంభపై కూడ కోర్టులో విచారణ నెలకొనడంపై ప్రారంభ అంశం ఆసక్తికరంగా మారింది. ఎట్టకేలకు ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభంపై చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడం, అక్కడ విద్యార్థులపై కరోనా ప్రభావం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తక్కువగా ఉందన్న వైద్యఆరోగ్య శాఖ సూచనలతో పాఠశాలలు రీ ఓపెనింగ్ సరైన సమయంగా విద్యాశాఖ భావించింది. ఈ మేరుకు విద్యాశాఖలోని అని విభాగాలకు ఆదేశాలను జారీ చేశారు. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ విద్యాలయాలు తెరవాలని స్కూల్, హైయర్ ఎడ్యూకేషన్ విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు.
విద్యా సంవత్సరం పొడగింపు..?
తాజాగా విద్యాసంవత్సరాన్ని పొడిగించాలన్న విజ్ఞప్తిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలను మే నెలలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మే 30 వరకు విద్యాసంవత్సరాన్ని పొడిగిస్తారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వాటి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను కూడా వెల్లడించాల్సి ఉంది. దీనికి ప్రతిపాదనలను సిద్ధం చేసి స్కూల్స్ రీఓపెనింగ్ తర్వాత ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగితే సిలబస్ పూర్తి చేయడం కష్టతరం అవుతుందని..దాని ప్రభావం వార్షిక పరీక్షలపై పడుతుందని పలు సంఘాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికితీసుకొచ్చాయి. దీంతో విద్యాసంవత్సరం పొడగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

