గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
– మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
మహబూబ్ నగర్, దర్శని ప్రతినిధి: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ చిరుత పులి ప్రాణాలను కోల్పోయింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలోని 167వ జాతీయ రహదారిపై చిరుతపులి మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతిచెందినట్లుగా తెలిసింది. తెల్లవారుజామున చిరుతపులి మృతదేహాన్ని గుర్తించిన వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. కాంక్రీట్ జంగిల్ పెరిగిపోవటంతో..అడవులు అంతరించిపోతున్నాయి..అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి.
