అర్బ‌న్ ఆసుప‌త్రితో మెరుగైన వైద్య సేవ‌లు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

అర్బ‌న్ ఆసుప‌త్రితో మెరుగైన వైద్య సేవ‌లు
– తాండూరులో త్వ‌ర‌లో అందుబాటులోకి
– వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డా.తుకారం
– ఇందిరానగ‌ర్‌లో అర్బ‌న్ ఆసుప‌త్రి ప‌రిశీల‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు ప్ర‌భుత్వం అర్బ‌న్ ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేస్తుంద‌ని వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారి డా.తుకారాం అన్నారు. హ‌మాలీబ‌స్తీలో గ‌తంలో నిర్మించిన మున్సిప‌ల్ క‌మ్యూనిటి హాల్‌ను అర్బ‌న్ ఆసుప‌త్రిగా మార్చారు. రూ. 8ల‌క్ష‌ల‌తో నిర్మిస్తున్న ఆర్బ‌న్ ఆసుప‌త్రి తుదిద‌శ‌కు చేరుకుంది. ఇందులో భాగంగా బుధ‌వారం తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి ఇందిరాన‌గ‌ర్ హ‌మాలి బస్తీలో ఏర్పాటు చేసిన అర్బ‌న్ ఆసుప‌త్రిని జిల్లా వైద్యాధికారి డా.తుకారం సంద‌ర్శించి ప‌రిశీలించారు. ఆసుప‌త్రిలో మౌళిక వ‌స‌తులు, ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ త్వ‌ర‌లోనే అర్బ‌న్ ఆసుప‌త్రిని అందుబాటుల‌కి తీసుక‌రావ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఆసుప‌త్రి ఏర్పాటు అయితే బ‌స్తీలోనే అర్బ‌న్ ఆసుప‌త్రి నుంచి మెరుగైన వైద్య సేవ‌లు అందుతాయ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఉప వైద్యాధికారి ధరణి కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్ యాదవ్, జినుగుర్తి మెడికల్ ఆఫీసర్, సిబ్బంది ఉన్నారు.