మోడీపై గులాబీ నేత‌ల ఫైర్

తాండూరు రాజకీయం వికారాబాద్

మోడీపై గులాబీ నేత‌ల ఫైర్
– న‌ల్లా జెండాల‌తో నిర‌స‌న, బైక్ ర్యాలీ
– క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని నేత‌ల‌ డిమాండ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడిపై టీఆర్ఎస్ నాయ‌కులు మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న‌పై ప్ర‌ధాని మోడి తెలంగాణపై అనుచిత వాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల మంత్రి కేటీఆర్ పిలుపు మేర‌కు తాండూరులో టీఆర్ఎస్ నేత‌లు నిర‌స‌న చేప‌ట్టారు టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం) ఆధ్వ‌ర్యంలో తాండూరు మార్కెట్ క‌మిటిచైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపాన‌ర్సింలు, సీనీయ‌ర్ నాయ‌కులు రాజుగౌడ్ త‌దిత‌రులు న‌ల్ల జెండాల‌ను ధ‌రించి మోడీకి, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తా నుంచి పుర‌వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వ‌హించారు.అనంత‌రం అంబేద్క‌ర్ చౌర‌స్తా వ‌ద్ద‌కు చేరుకుని నిర‌స‌న కొన‌సాగించారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడి తెలంగాణ రాష్ట్రంపై చిన్న‌చూపు చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు ఎన్నో ప్రాణాత్యాగాలు, సీఎం కేసీఆర్ ఉద్య‌మ స్పూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై ప్ర‌ధాని మోడి తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌క్ర‌బుద్దికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మాన ప‌రిచే విధంగా వ్యాఖ్య‌లు చేసిన మోడి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాపణ చెప్పి తీరాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే మ‌రిన్ని నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌ని హెచ్చ‌రించారు. టీఆర్ఎస్ మున్సిప‌ల్ ఫ్లోర్ లీడ‌ర్ శోభారాణి, టీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షులు రాందాస్, సీనీయ‌ర్ నాయ‌కులు శ్రీ‌నివాస్ చారి, తాండూరు మండ‌ల‌ మ‌హిళ నాయ‌కులు శ‌కుంత‌ల‌, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ మ‌హిళ అధ్య‌క్షురాలు సౌజ‌న్య‌, కౌన్సిల‌ర్ ముక్తార్ నాజ్, కోఆప్ష‌న్ స‌భ్యురాలు సారంగా, టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, సోష‌ల్ మీడియా ఇంచార్జ్ ఇంతియాజ్, పోట్లీ మ‌హారాజ్ దేవాల‌య చైర్మ‌న్ రాజ‌న్ గౌడ్, న్యాయ‌వాది గోపాల్, యూత్ అధ్య‌క్షులు అనిల్, ఎస్సీ సెల్ అధ్య‌క్షులు హ‌న్మంతు, యువ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.