ఘనంగా రాఖీ పౌర్ణమి
– సోదర ప్రేమను చాటుకున్న అక్కా చెల్లెల్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబందానికి.. ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని తాండూరు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రక్షాబంధన్ సందర్భంగా సహోదర, సోదరులకు అక్కా.. చెల్లెల్లు అన్నా.. తమ్ముళ్లకు రాఖీలు కట్టి
సోదర ప్రేమను చాటుకున్నారు. మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాఖీ పండగ సందర్భంగా అత్తారింటికి వెళ్లిన ఆడ బిడ్డలు రాఖీలు కట్టేందుకు తల్లిగారింటికి రావడంతో వారి వారి ఇండ్లలో పండగ సందడి నెలకింది. రాఖీలు కట్టిన అక్కలకు, చెల్లెల్లకు అన్నా దమ్ములు అండగా ఉంటామని భరోసాను కలిస్తూ రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు.
