దళిత, బహుజనులకు ఇళ్ల పట్టాలు
– కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటం ఫలితం
– వ్య.కా.స. జిల్లాఅధ్యక్షులు యు.బుగ్గప్ప
– కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ సంఘాల పోరాటంతోనే దళిత,బహుజనులకు ఇళ్లపట్టాల పంపిణీ సాధ్యమయ్యిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఉప్పలి మల్కయ్యలు అన్నారు. శనివారం యాలాల మండల కేంద్రంలో ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళితులకు ఇళ్ల స్థలాల కోసం 2007లో సర్వే నెంబర్ 289 లో రెండు ఎకరాల భూమి ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందని అట్టి భూమిని ఇల్లు లేని పేదలందరికీ పంపిణీ చేయాలని కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు అనేక పోరాట కార్యక్రమాలను ధర్నాలు, దీక్షలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు.
దళిత, బహుజనులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేయడం చాలా మంచి పరిమాణం అన్నారు. ఇందుకు సహకరించిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్, ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా కో ఆప్షన్ సంఘం జిల్లా అధ్యక్షుడు అక్బర్ బాబా, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిదంగా ఇళ్లపట్టాలను అందించిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గృహలక్ష్మి పథకం కింద ఎంపిక చేసి ప్రతి ఒక్కరికి 3లక్షల రూపాయలు సహాయం అందేవిదంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమేష్, వార్డు సభ్యులు కే. యాదప్ప, రాములు, రాజు, మహేష్, నర్సిములు, లాలప్ప, శివ కుమార్ లక్ష్మి,పాపమ్మ,నర్సమ్మ,సునంద,పార్వతమ్మ,జమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


