జయహో కేసీఆర్.!
– కేసీఆర్‌తోనే సంక్షేమవంతమైన పాలన
– తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన ఘనుడు
– వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయం
– తాండూరులో పండగలా జన్మదిన వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తాండూరు టీఆర్ఎస్ నాయకులు జేజేలు పలికారు. గురువారం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పండగలా జరుపుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనియర్ కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి, నాయకులు పాల్గొని హరితహారం చేపట్టారు. కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్‌ను కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ స్నాపికుడు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి దేశానికి ఆదర్శవంతంగా నిలిచారని కొనియాడారు. తెలంగాణలో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఆయన నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో జెండా ఎగురవేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, కౌన్సిలర్లు వెంకన్నగౌడ్, బోయరవి, టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు సౌజన్య, ప్రధాన కార్యదర్శి మాధవి, యువనాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

