యువత వ్యాపార రంగంలో ఎదగాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

యువత వ్యాపార రంగంలో ఎదగాలి
– గిఫ్ట్ షాపును ప్రారంభించిన డా. సంపత్ కుమార్
– పాల్గొన్న మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత వ్యాపార రంగంలో ఉన్నతంగా ఎదగాలని తాండూరుకు చెందిన సీనీయర్ నాయకులు డా.సంపత్ కుమార్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు.

బుధవారం పట్టణానికి చెందిన రియాజ్ అనే యువకుడు ఏర్పాటు చేసుకున్న గిఫ్ట్ షాప్‌ను డా. సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు. విఠల్ నాయక్ పాల్గొని యువకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి చెందాలని అన్నారు.

సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తాండూరు పట్టణం 20వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ యువనాయకులు సంతోష్ గౌడ్‌ జన్మదినంను పురస్కరించుకుని ఆయన చేత కేక్‌ కట్ చేయించారు. అనంతరం సంతోష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కాకర్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్‌ చారీ తదితరులు పాల్గొన్నారు.

కరణ్‌ కోట్‌లో చెట్టుపై పిడుగు..!