రేప‌టి నుంచి గ‌డ‌ప గ‌డప‌కు పైలెట్

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

రేప‌టి నుంచి గ‌డ‌ప గ‌డప‌కు పైలెట్
– వార్డు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం
– కౌన్సిల‌ర్ల‌తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్య‌మివ్వ‌బోతున్న‌ట్లు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. రేప‌టి నుంచి తాండూరు ప‌ట్ట‌ణంలో గ‌డప గ‌డ‌పకు పైలెట్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ ఫ్లోర్లు లీడ‌ర్లు, కౌన్సిల‌ర్ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమ‌వారం నుంచి గడప..గడపకు పైలెట్ పట్టణ బాట.. ద్వారా ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించ‌బోతున్న‌ట్లు తెలిపారు.
తాండూరు మున్సిపల్ లోని 36 వార్డుల పరిధిలో రోజూ 6 వార్డులలో ప‌ర్య‌టిస్తాన‌ని తెలిపారు. పార్టీలకు అతీతంగా కార్యక్రమం ఉంటుంద‌న్నారు. 23,24,25 తేదిలో మూడు రోజల పాటు 18 వార్డులలో పర్యట‌న త‌రువాత‌ 30,31,1 తేదిలో మరో 18 వార్డులలో ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పారు. ఆయా వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల గుర్తించి, తక్షిణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. రేపు పాత తాండూరు నిజాంషాయి దర్గాలో ప్రార్థనల అనంతరం కార్యక్రమం ప్రారంభం, 18,17,16,15,14, వార్డుల్లో పర్య‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈప‌ర్య‌ట‌న‌కు అన్ని శాఖల అధికారులు హాజ‌రుకావాల‌ని సూచించారు. అదేవిధంగా అన్ని పార్టీల కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు డాక్ట‌ర్ సంప‌త్‌కుమార్, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల న‌ర్సింలు, కాంగ్రెస్ కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్, ఫ్లోర్ లీడ‌ర్లు వ‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి, సోమ‌శేఖ‌ర్, సింధూజ‌గౌడ్, ఆసిఫ్, కౌన్సిల‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.