శాంతిభద్రతల పరిరక్షణకే నిర్భంద తనిఖీలు

క్రైం తాండూరు వికారాబాద్

శాంతిభద్రతల పరిరక్షణకే నిర్భంద తనిఖీలు
– తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్
– ఇందిరమ్మ కాలనీలో కార్డెన్ సెర్చ్
– 121 వాహనాల స్వాదీనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతిభద్రతల పరిరక్షణ కోసం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం యాలాల పోలీస్టేషన్‌ పరిధి తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీలో కార్డెన్‌ సెర్చ్ నిర్వహించారు. ఉదయం వేళ కాలనీని నిర్బంధించి పోలీసులు తనిఖీలు చేశారు. తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబులతో కలిసి ఇండ్లలో సోదాలు చేశారు. ఈ కార్డెన్‌ సెర్చ్‌లో అనుమానాస్పమైన 94 బైకులు, 20 ఆటోలు, 4 కారులు, మూడు బొలోరో మొత్తం 121 వాహనాలను స్వాదీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ మాట్లాడుతూ అసాంఘీక, అనుమానాస్పద ప్రాంతాలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా నేరాలనియంత్రణ సాధ్యమవుతుందున్నారు. నేరస్తులు, అపరిచిత వ్యక్తులు ఈ కార్డన్‌ సెర్చ్‌ ద్వారా దొరికిపోతారన్నారు. ఇలాంటి కార్డెన్‌లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సంరక్షణకు భరోసా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.నేరాలు అదుపు చేయవచ్చన్నారు. ఏమైనా అనుమానాస్పద సంఘటనలు గాని, వ్యక్తులు గాని కనిపిస్తే పోలీసులను సంప్రదించాలన్నారు. అదేవిధంగా వాహనదారులు లైసెన్స్‌లు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదని సూచించారు. కార్డెన్‌ సెర్చ్‌లో స్వాదీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి సరైన దృవపత్రాలను పరిశీలించి వదిలేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎస్ఐ అరవింద్, కాలనీ కౌన్సిలర్ వెంకన్నగౌడ్, దాదాపు 100 మంది పోలీసులు పాల్గొన్నారు.