మృతుని కుటుంబానికి వాసు పవార్ చేయూత
– అంత్యక్రియలకు రూ. 10వేల ఆర్థిక సాయం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి తాండూరు మండలం అంతారం తాండా భూకైలాస్ వ్యవస్థాపకులు వాసు నాయక్ పవార్ చేయూనందించారు. అంత్యక్రియల నిమిత్తం రూ. 10 వేలు అందించి మరోసారి మానవతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన ముల్ల కాసిం గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంభీకులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాసిం పరిస్థితి భాగులేదని హైదరాబాద్ రిఫర్ చేశారు. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదరవడంతో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ సహాకారంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసిం శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న భూకైలాస్ వ్యవస్థాపకులు వాసుపవార్ నాయక్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. కాసింకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పేదరికంలో ఉన్న కుటుంభానికి, కాశిం అంత్యక్రియల నిమిత్తం రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇందుకు కుటుంబ సభ్యులు వాసు పవార్ నాయక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతారం ఎంపీటీసీ శాంతు, సహకార సంఘం డైరెక్టర్ నర్సింలు, ముస్తఫా, సాయిలు, మొగలప్ప తదితరులు ఉన్నారు.

