దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఘనంగా స్టేషన్ హనుమాన్ టెంపుల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో ఆలయ చైర్మన్ గా సంజీవరావు, ప్రధాన అర్చకులుగా శ్రీధర్ జోషి, ధర్మకర్తలుగా జి.నరహరి, డి.మహేశ్వర్ రెడ్డి, ఎం.నగేష్, ముఖ్యమ్మలతో దేవాదాయ శాఖ ఇను స్పెక్టర్ మధుబాబు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితో పాటు దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దేవాలయలకు పాలకవర్గా ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పల్లెళ్ల దీపానర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, పద్దోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి. రాజుగౌడ్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, ముక్తార్, అశ్విని గుండప్ప, భద్రేశ్వరాలయ చైర్మన్ బంటారం సుధాకర్, పలు దేవాలయాల చైర్మన్లు కమలాకర్. కుంచెం మురళిధర్ రాజన్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్ గౌడ్, టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు సౌజక్య, ప్రధాన కార్యదర్శురాలు గాజుల మాధవి, సోషల్ మీడియా ఇంచార్జ్ ఇంతియాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు హన్మంతు, నాయకులు చంటి యాదవ్, ఎర్రం శ్రీధజ్, గుంపు, కోఆప్షన్ సభ్యులు వెంకట్రామ్ నాయక్, ఈఓ లాడెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

