జై హ‌నుమాన్.. జై శ్రీ‌రామ్..!

తాండూరు వికారాబాద్

జై హ‌నుమాన్.. జై శ్రీ‌రామ్..!
– భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో హ‌నుమాన్ దీక్షా దార‌ణ‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: జై హ‌నుమాన్.. జై శ్రీ‌రామ్.. నామ స్మ‌ర‌ణ‌తో తాండూరు ప‌ట్ట‌ణంలోని శ్రీ క‌న్యా పాఠ‌శాల హ‌నుమాన్ దేవాల‌యం మార్మోగింది. ఆదివారం హ‌నుమాన్ దీక్షా స‌మితి ఆధ్వ‌ర్యంలో 10 మంది భ‌క్తులు మండ‌ల దీక్ష దార‌ణ చేసుకున్నారు. గురుస్వామి హ‌నుమంతు, ఆల‌య అర్చ‌కులు ర‌వికుమార్ జోషీ స‌మ‌క్షంలో భ‌క్తులు దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ 41 రోజుల పాటు మండ‌ల‌ హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు నియమ నిష్టలతో ఉండాలన్నారు. నిరంతరం జై హ‌నుమాన్, జై శ్రీ‌రామ్ నామస్మ‌ర‌ణ చేయాల‌న్నారు. జై హ‌నుమాన్, రామనామ స్మరణం చేయటం ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడుతాయ‌న్నారు. దీక్ష‌ను భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పాటిస్తే కుటుంబాలు, మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని ద‌న్నారు. అదేవిధంగా ఆరోగ్య ర‌క్ష‌ణ‌కు, శత్రునాశనముకు, ఆత్మస్థైర్యమునకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపదుతుంది. మ‌రోవైపు హ‌నుమాన్ దీక్ష స‌మితి స‌భ్యులు మీది పేట వినోద్ మాట్లాడుతూ ఈనెల 23న హ‌నుమాన్ అర్ధ మండల దీక్ష చెప్పారు. దీక్ష చేప‌ట్టాల‌నుకునే భ‌క్తులు హనుమంతు గురు స్వామి(సెల్ : 8519994345)ని సంప్రదించగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు జై శ్రీరామ్ అశోక్, అనిల్, దీక్ష సమితి సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.