ద‌గ్ద‌మైన చెరుకు పంట రైతుల‌కు ప‌రిహారం

తాండూరు రాజకీయం వికారాబాద్

ద‌గ్ద‌మైన చెరుకు పంట రైతుల‌కు ప‌రిహారం
– బాధిత రైతుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– పాడైన పంట‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : విద్యుత్ షాక్ సర్క్యూట్ తో చెరుకు పంట నష్టపోయిన రైతులకు ప‌రిహారం అందించేందుకు కృషి చేస్తాన‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం తాండూరు మండలం గోనూర్ గ్రామంలో విద్యుత్ ప్రమాదం వల్ల గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి, జయశ్రీ, అంభోజీరావులు సాగు చేస్తున్న చెరుకు పంట కాలిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి దగ్ధమైన పంట పొలాన్ని పరిశీలించారు. జరిగిన ప్రమాదంపై రైతులతో కలిసి ఆరా తీశారు. వెంటనే తాండూరు తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, వ్య,వసాయశాఖ అధికారి రజితతో ఫోన్లో మాట్లాడారు. రైతులను ఆదుకోనేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించే విధంగా కృషి చే స్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, గ్రామసర్పంచ్ గోవింద్, నాయకులు పటేల్ ఉమాశంకర్, శకుంతల, అంతారం సర్పంచులు రాములు, నాయకులు తదితరులు ఉన్నారు.