కట్ట మైసమ్మకు పూజలు చేసిన ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లో వెలసిన శ్రీ కట్టమైసమ్మ తల్లికి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ పూజలు నిర్వహించారు. ఆదివారం ఆలయంలో అమ్మవారి జాతర ఉత్సవాలు జరిపారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు ప్రభాకర్ గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా అందరిని అమ్మవారు సల్లంగా చూడాలని ప్రార్థించినట్లు ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

