పెరుమాళ్ల కుటుంబానికి ఎమ్మెల్సీ సంతాపం

తాండూరు రాజకీయం వికారాబాద్

పెరుమాళ్ల కుటుంబానికి ఎమ్మెల్సీ సంతాపం
– కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మండ‌లం ఖాంజాపూర్ గ్రామానికి చెందిన న‌మ‌స్తే తెలంగాణ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు పెరుమాళ్ల వెంక‌ట్ రెడ్డి కుటుంబానికి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి సంతాపం తెలిపారు. పెరుమాళ్ల వెంకట్ రెడ్డి అన్న అనంతరెడ్డి భార్య లక్ష్మి శనివారం ఆకస్మికంగా మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్, తాండూరు మార్కెట్ క‌మిటి మాజీ చైర్మ‌న్ వడ్డె శ్రీనివాస్లు గ్రామానికి వెళ్లి పెరుమాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామనారు. శోక సముద్రంలోని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్సీ వెంట నాయ‌కులు పట్లోళ్ల నర్సిములు గారు, పట్లోళ్ల బాల్ రెడ్డి గారు, బిర్కట్ రఘు, అశోక్, దత్తాత్రేయ త‌దితరులు ఉన్నారు.