సాగునీటి ప్రాజెక్టులతో వికాబాద్ జిల్లాకు మహర్దశ

తాండూరు రాజకీయం వికారాబాద్

సాగునీటి ప్రాజెక్టులతో వికాబాద్ జిల్లాకు మహర్దశ
– ప్రాజెక్టు వనరుల విస్తరణతోనే సాధ్యం
– కోడంగల్‌ ఎత్తిపోతలను తాండూరుకు పొడగించాలి
– మూసీ, కోట్‌పల్లి, కాగ్నా, శివసాగర్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
– సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత యు.రమేష్ కుమార్ లేఖ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను విస్తరించి.. వనరులను పెంపు చేస్తే జిల్లాకు మహర్దశ వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
kvcs
గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాగునీటి ప్రాజెక్టు వనరుల పెంపు పై సుదీర్ఘ విషయాలతో లేఖ పంపినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నేతగా కాకుండా ఓ రైతు బిడ్డగా వికారాబాద్ జిల్లాకు అవసరమైన ప్రాజెక్టులు, ఇంతకుముందున్న ప్రాజెక్టుల మరమ్మత్తులు, వినియోగంపై అభిప్రాయాలను లేఖలో తెలిపినట్లు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తమ్మిడిహట్టి దగ్గర నిర్మించి చేవేళ్ల, వికారాబాద్ వరకు నీళ్లు రప్పిస్తామని అనడం స్వాగతిస్తున్నామని అన్నారు. అంతేకుండా జిల్లాలో సాగునీటి వనరుల పెంపుకు కూడా కృషి చేయాలని కోరారు. జిల్లాలో 9200 ఎకరాల ఆయకట్టు ఉన్న మద్య తరహా ప్రాజెక్టు కోట్ పల్లి ఒక్కటే ఉందని, దీనిని 14000 ఎకరాలకు పెంచాలని కోరారు. దీనికి ప్రత్యేక అధికారిని నియమించి పూర్తి చేయాలన్నారు.

అదేవిధంగా సర్సన్ పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి చిన్న తరహా ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉండడంతో సాగునీరుతో పాటు అదనపు వనరులు ఎలా సమకూర్చాలనే దానిపై సమగ్ర నివేధిక రూపించాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లాలో మూసీ నది ప్రవహిస్తూ ఎలాంటి చెక్ డ్యాం లు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, మూసీ ఎగువభాగంలో ఉన్న రైతులకు లబ్దిచేకూరే విధంగా ఆలోచనలు చేయాలని కోరారు. ధారూర్, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల మీదుగా ప్రవహిస్తున్న కాగ్నానది జలాలు ప్రతియేడాడా 14టీఎంసీల వరకు కర్ణాటకకు తరలువుతున్నాయని, కాగ్నానదిపై 6 టీఎంసీల రిజార్వాయుర్ నిర్మిస్తే స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వికారాబాద్ జిల్లాకు పోడగించడం మంచి నిర్ణయమే అని, కోడంగల్ తో పాటు పక్కనే ఉన్న తాండూరు, యాలాల, ధారూర్ ప్రాంతాలకు మళ్లీస్తే మేలు జరుగుతుందన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేతులేత్తేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లి నిర్మించాల్సిన రిజర్వాయర్ పూర్తి చేయాల్సింది కోరారు. దీనిని పూర్తి చేసి పరిగి ప్రాంతానికి నీళ్లు అందించాలని కోరారు. యాలాల శివసాగర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి.. సాగునీటి వనరులు పెంచే విధంగా చూడాలని కోరారు. ఇందుకోసం జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో చర్చించి.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. వీటిని డిమాండ్లుగా భావించకుండా.. విన్నపాలుగా భావించి పూర్తి చేయాలని కోరారు.

ఇదికూడా చదవండి…

వైద్యం.. మారుతోంది..!