ప్ర‌త్యేక స‌మావేశం త‌ర్వాత పెంచిన జీతాలు

తాండూరు వికారాబాద్

ప్ర‌త్యేక స‌మావేశం త‌ర్వాత పెంచిన జీతాలు
– కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
-మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హామి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పారిశుద్ధ్య కార్మికుల పెంచిన జీతాలను అమలు చేసేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు చైర్ పర్సన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిప‌ల్ కాంట్రాక్టు కార్మికుల‌కు 11 వ పీఆర్సీ ప్ర‌కారం పెంచిన జీతాల‌ను చెల్లిస్తున్నార‌ని తెలిపారు. కాని తాండూరు మున్సిప‌ల్‌లో అమ‌లు కావ‌డం లేద‌ని, పెంచిన వేత‌నాల‌ను అమ‌లు చేసి కార్మికుల‌కు న్యాయం చేయాల‌ని కోరారు. ఇందుకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ స్పందిస్తూ గత కౌన్సిల్ సమావేశంలో తీర్మానించడం జరిగిందని. కొన్ని కారణాల వల్ల ఎజెండా అంశం కోర్టుకు వెళ్లిందన్నారు. పెంచిన జీతాలను అమలు చేస ఎందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించి వేతనాలు చెల్లించేలా చూస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింలు, గౌ పాల్, అశోక్, వెంకటేష్, వెంకటప్ప, మహిళ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.