గ్రామాభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలి : నర్సింహారెడ్డి (బాబు)

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

గ్రామాభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలి
– మంత్రి సబితా రెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి (బాబు)
– కోటబాస్పల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామాభివృద్ధికి గ్రామ‌స్తులంద‌రు ఐక్యంగా తోడ్పాటు అందించాల‌ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి సోద‌రుడు, తాండూరు సీటీకేబుల్ ఎండి న‌ర్సింహారెడ్డి(బాబు) అన్నారు. బుధవారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు ప్రారంభోత్సవానికి నర్సింహారెడ్డి(బాబు) హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుర్వ నాగార్జున ఆధ్వర్యంలో తాండూరు మండల వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, నాయకులు కలిసి సంయుక్తంగా సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం నర్సింహారెడ్డి (బాబు) మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో మౌళిక సదుపాయాల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తామన్నారు. సర్పంచ్ నాగార్జున మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, నాయకులు వెంకట్రామ్ రెడ్డి, బాస్కర్, శేఖర్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.