ఉద్యోగ సాధ‌నే ల‌క్ష్యం..!

కెరీర్ తాండూరు వికారాబాద్

ఉద్యోగ సాధ‌నే ల‌క్ష్యం..!
– క‌ష్ట‌ప‌డి కొలువులు సాధించండి
– తాండూరు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉద్యోగ సాధ‌నే ల‌క్ష్యంగా యువ‌త పోటీ త‌త్వాన్ని పెంచుకోవాల‌ని తాండూరు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌గ‌తి కోచింగ్ సెంట‌ర్‌లో ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగ సాధ‌న‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. కోచింగ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ శ్రీ‌శైలం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మానికి సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి హాజ‌రై నిరుద్యోగుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. నిరుద్యోగ యువ‌త ఏదైనా ఉద్యోగాన్ని సాధించాలంటే ప‌క్కా ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌న్నారు. ఇత‌రుల‌తో పోటీ ప‌డ‌డం నేర్చుకుంటే ఉద్యోగ సాధ‌న‌పై క‌సి పెరుగుతుంద‌న్నారు. ఎలాంటి సంద‌ర్భంలోనూ నిరుత్సాహాం చెంద‌కుండా క‌ష్ట‌ప‌డి చ‌దివి కొలువుల క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌న్నారు. ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగాల‌పై యువ‌త‌కు కోచింగ్ ఇవ్వ‌డం ప్ర‌గ‌తి కోచింగ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ శ్రీ‌శైలంను సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి అభినందించారు. సంకల్ప బ‌లంలో చదివి ప్రగతి కోచింగ్ సెంటర్ కు, తల్లి దండ్రులకు మంచి పేరు తీసుక‌రావాల‌ని దిశా నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీశైలం, రీజనింగ్ వెంకటేష్, రాజా రెడ్డి, యువ‌తీ యువ‌కులు పాల్గొన్నారు.